Header Banner

అల్లు అర్జున్‍కు మరో షాక్.. ఆ చిత్రం లాభాలు పంచాలంటూ పిటిషన్.!

  Mon Mar 10, 2025 21:02        Entertainment

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప-2 ది రూల్ చిత్రం రికార్డు స్థాయిలో రూ.1740.95 కోట్ల వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా లాభాలను చిన్న బడ్జెట్ చిత్రాల రాయితీకి వినియోగించాలని, జానపద కళాకారుల పెన్షన్ కోసం కేటాయించాలని తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. పుష్ప-2 చిత్రం బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుతో బాగానే ఆదాయం రాబట్టిందని, ప్రభుత్వమే టికెట్ ధరలకు అనుమతి ఇచ్చిందని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. అయితే ఏ ప్రాతిపదికన టికెట్ ధరల పెంపునకు, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో చెప్పలేదని... అందుకే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ లాభాలను కళాకారుల సంక్షేమం కోసం కేటాయించాలని కోరారు. అయితే, ఇప్పటికే బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ముగిశాయి కదా అని న్యాయమూర్తి ప్రశ్నించగా... బెనిఫిట్ షోలు, టికెట్ పెంపు వల్ల వచ్చిన లాభాల గురించే తాము పిల్ దాఖలు చేశామని పిటిషనర్ తెలిపారు. వాదనలు విన్న అనంతరం... గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని సమర్పించాలని పిటిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ పిల్ ను అడ్వొకేట్ నరసింహారావు దాఖలు చేశారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pushpa2 #AmbatiRambabu #AlluArjun #MovieNews #Tollywood #AndhraPradesh